14 July, 2026 | 3:39 PM

Breaking News

కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •  

ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి

13-10-2025 06:56 PM

జిల్లా కలెక్టర్ ఎం.హరిత..

ప్రజావాణికి 81 దరఖాస్తులు..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిత(District Collector M. Haritha) ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి కలెక్టర్ ఎం.హరిత దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 81 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 48, పంచాయితీ రాజ్ శాఖకు 11, ఎస్పీ కార్యాలయానికి 5, ఉపాధి కల్పనాశాఖకు 4, సిరిసిల్ల మున్సిపాలిటీ, విద్యా శాఖకు 3 చొప్పున, పౌరసరఫరాలు, మత్స్య, వైద్యారోగ్య, రవాణా, సంక్షేమ, వేములవాడ మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ కు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి.‌ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.