13-10-2025 06:58:22 PM
హుజూరాబాద్ (విజయక్రాంతి): డీసీసీ అధ్యక్ష పదవికి టీపీసీసీ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ హుజురాబాద్ ప్రాంతానికి చెందిన తిప్పారపు సంపత్ దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం కరీంనగర్ లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం దరఖాస్తు ఫారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తూ, విద్యార్థి ఉద్యమాలు, యువజన ఉద్యమాలు, దళిత ఉద్యమాలు చేశానని అన్నారు. బీఆర్ఎస్ అరాచక పాలనలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అవినీతిపై పోరాడి, నెలల తరబడి జైల్లో గడపడం జరిగిందన్నారు. కేసులకు, జైళ్లకు ఏ ఒక్కరోజు అధైర్య పడకుండా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో సేవ చేశానని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ మారలేదని అన్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుండి, దళిత కుటుంబం నుండి వచ్చిన తనకు జిల్లా అద్యక్ష పదవికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.