calender_icon.png 13 October, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: శంభీపూర్ క్రిష్ణ

13-10-2025 06:55:24 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ సూచించారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంజూరు చేయించిన రూ.3,00,000/- సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధిత 7 చెక్కులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ... ఆపదలో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.