24 April, 2026 | 8:02 PM

చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

24-04-2026 06:52 PM

బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని ఎంఎంపియుపిఎస్ చీలాపూర్ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థుల ఫేర్‌వెల్, యుకెజి చిన్నారుల గ్రాడ్యుయేషన్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీలాపూర్ సర్పంచ్ శనగోండ స్వరూప ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి విద్యే బలమైన పునాది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు కూడా గొప్ప స్థాయికి ఎదగగలరని నిరూపించాలని. విద్యార్థులు మరింత కష్టపడి చదివి తమ గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి.తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని సూచించారు. చీలాపూర్పల్లి సర్పంచ్ శ్రీనివాస్, గంగాధర రాజమల్లు, ఉపాధ్యాయులు,నాగయ్య, ఓదయ్య, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.