2 July, 2026 | 12:33 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు ప్రత్యేక బస్సు సౌకర్యం

03-06-2025 05:00 PM

హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్..

హుజురాబాద్ (విజయక్రాంతి): అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఈనెల 9న ప్రారంభమవుతుందని, ఇట్టి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్(Huzurabad RTC Depot Manager Ravindranath) తెలిపారు. ఈనెల 9న మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ బస్ స్టేషన్ నుంచి బస్ బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, మరుసటి రోజు 10వ తేదీన రాత్రి వరకు అరుణాచలం చేరుకుని, 11వ తేదీన అరుణాచల గిరి ప్రదక్షి అనంతరము తిరిగి సాయంత్రం 4 గంటలకు ఆరుణాచలంలో బయలుదేరి 12వ తేదిన హుజురాబాద్ కి బస్ చేరుకుంటుందని డీఎం రవీంద్రనాథ్ తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుకు చార్జి పెద్దలకు రూ.4,500/-, పిల్లలకు రూ.3,800/- గా నిర్ణయించినట్లు తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్ కొరకు ఈక్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 9959225924, 9704833971, 9247159535, 9441404841 కి ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కుడా ఉన్నదని, ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎం తెలిపారు.