11-01-2026 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతు లు లేకుండా ఏర్పాటు చేసిన అనధికార హోర్డింగులు, బ్యానర్లు, ప్రకటనల ఏరివేతకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. నగర సుందరీకరణకు విఘాతం కలగడంతో పాటు, ప్రజా భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న అక్రమ కట్టడాలపై శనివారం నుంచి ’స్పెషల్ డ్రైవ్’ ప్రారంభించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోకి పలు మున్సిపాలిటీలు విలీనం అయిన తర్వాత, ఆయా ప్రాంతాల్లో అనధికార ప్రకటనలు జోరుగా వెలిసినట్లు అధికా రులు గుర్తించారు. మున్సిపల్ నిబంధనలను తుంగలో తొక్కి ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్లు, బ్యానర్లను గుర్తించి, వాటిని తొలగించే ప్రక్రియను శనివారమే ప్రారంభించా రు. ఈ డ్రైవ్ కేవలం ఒక రోజుతో ఆగదని, దశలవారీగా నగరం మొత్తం నిరంతరాయంగా కొనసాగుతుందని కమిషనర్ స్ప ష్టం చేశారు.
అనధికార ప్రకటనలపై నిఘా ఉంచేందుకు, క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఒక ఎన్ఫోర్స్మెంట్ బృ ందాన్ని ఏర్పాటు చేసినట్లు కర్ణన్ తెలిపారు. ప్రకటనదారులు, యాడ్ ఏజెన్సీలు, భవన యజమానులకు కమిషనర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తప్పనిసరిగా జీహెచ్ ఎంసీ నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే హోర్డింగులు, ప్రకటనలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.