11-01-2026 12:00:00 AM
అతిపెద్ద కార్పొరేట్ క్రికెట్ లీగ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): ఫోర్ రైజ్ స్పోర్ట్స్ ఎల్‌ఎల్పీ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ (ఎఫ్‌పీఎల్) హైదరాబాద్ సీజన్1ను శుక్రవారం హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభించారు. ‘ప్లే ఫర్ ఎ కాజ్’ అనే ప్రత్యేక భావనతో రూపొందిన ఈ లీగ్ హైదరాబాద్లో అతిపెద్ద, ప్రొఫెషనల్‌గా నిర్వహించబ డుతున్న కార్పొరేట్ క్రికెట్ లీగ్‌గా నిలవనుంది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ అధికారి క పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆర్మూర్ ఎమ్మె ల్యే పైడి రాకేష్‌రెడ్డి హాజరై కార్పొరేట్ క్రీడలు, సామాజిక బాధ్యతను సమన్వ యం చేస్తూ ముందుకు సాగుతున్న ఎఫ్‌పీఎల్ లక్ష్యాలకు తన మద్దతును ప్రకటించారు. ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్‌ను చైర్మన్, వ్యవస్థాపకులు నంగి దేవేందర్‌రెడ్డి, వ్యవస్థాపకులు, అధ్యక్షులు డా శ్రీప్రకాశ్ విన్నకోట స్థాపించారు.
కార్యక్రమంలో ఎఫ్‌పీఎల్ బోర్డు సభ్యుల్లో ఐకాన్ వ్యవస్థాపకులు, చైర్మ న్, ఫోర్ రైస్ స్పోర్ట్స్ ఎల్‌ఎల్‌పీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్రిష్ చింతలూరి, యెల్డామ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, ఫ్రైట్ చైల్ ఫౌండేషన్ ప్రతినిధి మోహిత్ కుమార్ ఫ్రూటీవా లా, వై ఆక్సిస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేషన్స్, బిజినెస్ పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ జయలలిత ఆకురతి, మాజీ రంజీ దులీప్ ట్రోఫీ క్రికెటర్, బీసీసీఐఎన్‌సీఏ లెవల్2 కోచ్ ఎం. సురేష్, క్వాలిజీల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఇన్ఫోసిస్, కోఫోర్జ్ మాజీ హెచ్‌ఆర్ హెడ్ వెంకరెడ్డి, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో అనుబంధం ఉన్న సీనియర్ పరిపాలనాధికారి పీసీఎస్‌రెడ్డి పాల్గొన్నారు. జనవరి 24 నుం చి ఏప్రిల్ 26 వరకు లీగ్ నిర్వహించబడుతుంది. 96 కార్పొరేట్ జట్లు, 1,4 40 మంది క్రీడాకారులు, 100కు పైగా కార్పొరేట్ సంస్థ లు పాల్గొంటాయి. హైదరాబాద్లోని 8 క్రికెట్ మైదానాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఎం ఎస్కే గ్రౌండ్ ప్రధాన వేదికగా ఉంటుం ది. విజేతకు రూ.2 లక్షలు, రన్నరప్‌నకు లక్ష, మూడో స్థానానికి రూ.75 వేలు, నాల్గో స్థా నానికి రూ.50 వేలు అందజేయబడతాయి.