11 July, 2026 | 1:51 AM

నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్

11-07-2026 12:00 AM

70 వాహనాలకు రూ.50 వేలు ఫైన్లు 

పెబ్బేరు జులై 10: మున్సిపల్ కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఎదుట, సుభాష్ చౌరస్తా వద్ద చేపట్టిన డ్రైవ్లో 70కి పైగా వాహనాలను గుర్తించి స్టేషన్కు తరలించారు. అనంతరం వాహనదారులకు రహదారి భద్రత, మోటారు వాహన చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించారు.

నిబంధనలకు అనుగుణంగా నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించిన తర్వాత వాహనాలను విడుదల చేశారు. వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు మొత్తం రూ. 50 వేల వరకు జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు. నెంబర్ ప్లేట్లు లేకుం డా, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేశ్వర్లు గౌడ్ హెచ్చరించారు.