డిఫెన్స్ మద్యం లభ్యం.. వ్యక్తి అరెస్ట్
ఎక్సైజ్ సీఐ సుధాకర్
మహబూబ్ నగర్ జూలై 10 (విజయ క్రాంతి) : డిఫెన్స్ మధ్యన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తి పై కేసు నమోదు చేసి ఆ మధ్యన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన నగరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఎక్సైజ్ సీఐ సుధాకర్ వివరాలు ఇలా ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీ దగ్గర అంతర్రాష్ట్ర రోడ్డు 167 లో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతుండగా కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఆ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి 30 డిఫెన్స్ మద్యం బాటిల్లను నేషనల్ హైవే పై ఉన్న ప్రధాన హోటాల్స్ తో పాటు ప్రైవేట్ ఫంక్షన్లు చేసుకున్న వారికి అతన్ని సంప్రదిస్తే విక్రయించేందుకు పాల్పడుతున్నాడు.
ఈ మధ్య విలువ రూ 70 వేలు ఉంటుంది. సాదరణ తనిఖీల్లో భాగంగా ఈమధ్య లభించిందని ఎక్సైజ్ అధికారి సుధాకర్ తెలిపారు. అక్రమంగా మద్యం మద్యంను వినియోగిస్తున్నట్లు ఎవరికైనా అనుమానం ఉన్నా, ల సమాచారం 687265884, 8712658872, 8712658 861, 8712658859 అను నెంబర్లకు తెలపాలన్నారు. ఈ తనిఖీలలో ఎస్‌ఐ సుష్మ కసిరెడ్డి, నిరయన్ గౌడ్, ఖధీర్, గోవిందు, లక్ష్మి పాల్గోన్నారు.






