19 August, 2026 | 3:54 AM

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

19-08-2026 12:12 AM

సమీక్షలో ఎమ్మెల్యే జీఎంఆర్

అమీన్పూర్/పటాన్చెరు, ఆగస్టు 18: అమీన్‌పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలో పారిశుధ్య పరిస్థితులపై ఎమ్మెల్యే జీఎంఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చెత్త సేకరణ, తరలింపులో సంబంధిత రాంకీ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. వ ర్షాకాలంలో చెత్త పేరుకుపోవడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చెత్త సేకరణలో ఒక్క కాలనీ కూడా నిర్లక్ష్యానికి గురికాకూడదని, రాంకీ సంస్థ పనితీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశి ంచారు.

శానిటేషన్ సిబ్బంది, డిప్యూటీ కమిషనర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని సూ చించారు. ప్రతి కాలనీలో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. నూతన కాలనీలు, బస్తీల్లో వీధిదీపాల సమస్యపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా యని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి వీధిలో వీధిదీపాలు వెలిగేలా అధికారులు చర్యలు తీసు కోవాలని ఆదేశించారు.

ఇంద్రేశం, ఇస్నాపూ ర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం ము న్సిపాలిటీల్లో విస్తరిస్తున్న నూతన కాలనీలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పటాన్‌చెరు మండలంలోని ౩ గ్రామాలు, గుమ్మడిదల మండలంలోని ౮ గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, యూజీడీ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీవోలను ఆదేశించారు.