13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఆదివాసీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

24-03-2026 12:00 AM

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్

మంచిర్యాల, మార్చి 23 (విజయక్రాంతి): ఆదివాసి గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అన్నారు. సోమవారం జిల్లాలోని జన్నారం మండలంలో ఆదివాసీ గిరిజనులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్య, వైద్య సేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు అంశాలను అధికారులతో కలిసి పరిశీలించారు.

మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి కల్పిస్తున్న సదుపాయాలు, తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడ ముఖ్యమే అని, విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాలలో రాణించాలన్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యా బోధన తీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలన్నారు. ఆసుపత్రిలోని రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి ఆరోగ్య స్థితిగతులు, ఇతర వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  అలాగే కవ్వాల్ వెదురు ఉత్పత్తులు, శిక్షణ కేంద్రాన్ని సందర్శించి శిక్షణ కేంద్రంలో తయారు చేసిన రకరకాల వెదురు ఉత్పత్తులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా జన్నారం పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు, జన్నారం ఆరోగ్య కేంద్రంలో త్రాగునీరు, వీల్ చైర్, ఇతర సౌకర్యాలపై టిపిసిసి రాష్ట్ర ప్రతినిధి, జన్నారం మండలంలో కోతుల బెడదను తొలగించాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ జన్నారం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాలలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాసరావు, మంచిర్యాల డి.టి.డి.ఓ. రమాదేవి, ఏటీడీఓ సురేష్, ఇన్చార్జి తహసిల్దార్ నేరెళ్ల రామ్మోహన్, గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీరాజం, ప్రిన్సిపల్ రామస్వామి, ఉపాధ్యాయులు కాంతారావు, ప్రభుత్వ వైద్యాధికారులు ఉమాశ్రీ, లక్ష్మి, పోలీస్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.