31 March, 2026 | 1:58 AM

దళిత ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

31-03-2026 12:05 AM

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఏ బ్లాక్ అద్యక్షులు :పానుగంటి మహేష్ కుమార్

మేడ్చల్ అర్బన్, మార్చి 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని దళిత ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హుజూరాబాద్ బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసినట్లు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఎ బ్లాక్ అద్యక్షులు పానుగంటి మహేష్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామిని గన్ పూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి లతో పాటు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తుపాకీతో కాల్చేతానని సైగలు చేసిన ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ దళిత ఎమ్మెల్యేలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పని యేడల పాడి కౌశిక్ రెడ్డి అనే పిచ్చోడిని సమాజం నుండి వెలివేయాలని ఇలాంటి పిచ్చోడిని ఎక్కడ తిరిగినా చెప్పులతో భౌతికంగా కూడా దాడులు చేస్తామని ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పానుగంటి మహేష్ కుమార్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివశంకర్ ముదిరాజ్.ఓబిసి సెల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్.మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ.మాజీ కౌన్సిలర్ లు చాపరాజు.కౌడే మహేష్ కురుమ.జాకట దేవరాజు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల మల్లేష్ ముదిరాజ్.రామన్నగారి రాఘవేందర్ గౌడ్,మోహన్ ముదిరాజ్.రామన్నగారి సంతోష్ గౌడ్.గర్దాస్ నరేందర్ మహిళా అధ్యక్షురాలు ప్రేమలత.నడికొప్పు రంజిత్ ముదిరాజ్.దుబ్బ రామస్వామి ముదిరాజ్.నవీన్.యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్.ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్.ఆరిఫ్.వినోద్.మల్లేశ్వరి. రేణుక. చిన్న రేణుక తదితరులు పాల్గొన్నారు.