13 May, 2026 | 2:12 AM

భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

13-05-2026 12:37 AM
  1. అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించిన 
  2. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా 

మహబూబ్ నగర్ మే 12 (విజయ క్రాంతి) : ఉదండాపూర్ భూ నిర్వాసితుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉదండాపూర్ భూనిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్, జడ్చర్ల మిషన్ భగీరథ నీటి సరఫరా అంశాలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా తో కలిసి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సమీక్ష చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి భూనిర్వాసితులకు అందాల్సిన పునరావాసం, పరిహారం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ను అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

భూనిర్వాసితుల సమస్యలను సానుభూతితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అనంతరం జడ్చర్ల నియోజకవర్గంలోని మిషన్ భగీరథ నీటి సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, తండాలు, కాలనీలకు తాగునీటి సరఫరా నిరంతరాయంగా అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా పైప్లైన్ సమస్యలు, మోటార్ లోపాలు లేదా నీటి సరఫరాలో అంతరాయం ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధికారులు ఉన్నారు.