కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు, సరికొత్త డిజైన్లు
అట్టహాసంగా వారాహి జ్యువెల్స్ వార్షికోత్సవాలు షురూ
బంజారాహిల్స్, జూలై 16(విజయక్రాంతి): ప్రముఖ ఆభరణాల సంస్థ వారాహి జ్యువెల్స్ మూడో వార్షికోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ప్రారంభమైన ఈ వేడుకలు జూలై 19 వరకు కావూరి హిల్స్ లోని షోరూంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ ప్రీతిరెడ్డి ముఖ్య ఆహ్వానితులుగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ విషయమై సంస్థ వ్యవస్థాపకుడు సందీప్ కరణం మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా వేలాది సరికొత్త డిజైన్లతో కూడిన ఆభరణాల ప్రదర్శనతో పాటు అమ్మకాలను నిర్వహిస్తున్నామన్నారు.సంప్రదాయ కళాత్మకతకు ఆధునికతను జోడించి డైమండ్, కుందన్, పోల్కీ, నక్ష్, టెంపుల్ జ్యువెలరీతో పాటు డైలీ వేర్ ప్రత్యేక కలెక్షన్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు, సరికొత్త డిజైన్ల ఆభరణాలను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు.
అనంతరం ప్రీతిరెడ్డి మాట్లాడుతూ వారాహి జువెల్స్ డిజైన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయన్నా రు.ప్రదర్శనలో బంగారం, వెండి, వెండి మీద బంగారం పూతతో ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






