calender_icon.png 26 September, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ గురు పీఠంలో విశేషపూజలు

26-09-2025 12:52:00 AM

శివ్వంపేట్,(విజయక్రాంతి): గూడూరు శ్రీ గురుపీఠంలో భక్తులు మొట్టమొదటి దత్తావదారులు స్వామివారికి గురువారం అభిషేకం, అర్చనలు నిర్వహించడం జరిగినది. శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్టు పౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో దివ్యమూర్తులైన శ్రీదత్తాత్రేయ స్వామి, షిరిడి సాయినాథునికి భక్తులు విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీ గురుపీఠం ట్రస్టు చైర్మన్ శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ శ్రీపాదవల్లభ స్వామి జననం పరమ పవిత్రమైనదని, శ్రీపాదవల్లభుల దర్శనం భాగ్యంతో పాటు రోజంతా స్వామివారి నామస్మరణ చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయని ఆయన తెలిపారు.

శ్రీసాయినాథ స్తవన మంజరి పూర్తి చేసిన రోజు అయినందున భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం పూర్వ జన్మ సుకృతమని ఆయన అన్నారు.అనంతరం శ్రీగురుపీఠం ట్రస్టు తరుపున భక్తులకు కొడకంచి సుదర్శన్ గౌడ్ మరియు శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని  శివకుమార్ గౌడ్ ఇద్దరు సమిష్టి ఆధ్వర్యంలో  అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.