calender_icon.png 26 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం దాతలకూ మేలు చేస్తుంది

26-09-2025 12:52:39 AM

గీతంలో ఫార్మసిస్ట్ దినోత్సవంలో వినయ్ కుమార్ గుప్తా 

పటాన్ చెరు, సెప్టెంబర్ 25 రక్తదానం చేయడం చాలా మంచిదని, అది దాతల్లో రక్తపోటును తగ్గించడంలో పాటు కొత్త రక్తాన్ని ఉత్పత్తి చేసి చురుకుగా ఉండేలా చేస్తుందని కేంద్ర ఔషధ నియంత్రణ మండలి (సీడీఎస్సీవో) ప్రాంతీయ కార్యాలయ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ వినయ్ కుమార్ గుప్తా అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో గత నాలుగు రోజులు నిర్వహిస్తున్నప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాల ముగింపు సదస్సు గురువారం నిర్వహించారు.

అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో 145 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ, వియత్నాం వంటి చిన్న దేశాల నుంచి ఫ్లాస్మాను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని విచారం వెలిబుచ్చారు. సగం మంది ప్రజలు రక్తదానం చేయడానికి ముందుకొచ్చినా ప్రపంచ దేశాలకు మనమే రక్తం ఎగుమతి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. 

క్రీడా పోటీలలో సత్తా చాటిన గీతం...

గీతం వ్యవస్థాపకుడు డాక్టర్ ఎం.వి.వి.ఎస్ మూర్తి స్మారక అంతర్ ప్రాంగణ క్రీడా పోటీలు (ఇంటర్ క్యాంపస్ టోర్నమెంట్), ప్రతిభావంతుల ఎంపికలో గీతం హైదరాబాదు ప్రాంగణ విద్యార్థులు ప్రతిభను చాటి చెప్పారు.

గీతం విశాఖపట్నం, హైదరాబాదు, బెంగళూరు మూడు ప్రాంగణాల ప్రతిభావంతులైన విద్యార్థి అథ్లెట్లను ఈ పోటీలు ఒకచోటకు చేర్చాయి. గీతం హైదరాబాదు జట్లు అథ్లెటిక్స్, టీమ్ గేమ్ లతో పాటు రాకెట్ క్రీడలలో కూడా పతకాలు సాధించడం ద్వారా అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.

అథ్లెటిక్స్ లో వంద, రెండు వందలు, 1500 మీటర్ల పరుగు పోటీలు, షాట్ పుట్, పురుషులు-మహిళల 4x100 మీటర్ల రిలేలలో పతకాలు సాధించారు. గీతం హైదరాబాదు ప్రాంగణం నుంచి 33 మంది విద్యార్థులు దక్షిణ భారత ప్రాంతీయ (సౌత్ జోన్) పోటీలలో గీతం వర్సిటీకి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు.