26-09-2025 12:50:48 AM
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్
కంగ్టి, సెప్టెంబర్ 25 : మానవులందరూ సమానమేనని, ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని మల్కా జ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టిలో గురువారం విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుహాసిని మహిళా పాదపూజ కా ర్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ టల రాజేందర్ మాట్లా డుతూ కులాలన్నీ ఒక్కటేనని చెబుతూ ఇన్నాళ్లు వెలివేయబడ్డ దళిత గిరిజనులకు నమ్మకం కలిగిం చేందుకు పాదపూజ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఊరవతల వెలివేయబడిన దళిత కాల నీలు, అడవి ప్రాంతంలో నివసించే గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కుల వివక్షకు గురయ్యారని తెలిపారు. ప్రస్తుతం నేటి సమాజంలో పట్టణ ప్రాంతంలో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారని తెలిపారు.
అక్కడక్కడ గ్రామాల్లో ఇప్పటికీ కొ నసాగుతున్న కుల వివక్ష రూపుమాపేందుకు సామాజిక సమరసత అభియాన్ చేస్తున్న కార్యక్రమాలను అందరూ పాటించాలని తెలిపారు. స్వా మీజీలు, గురూజీల సమక్షంలో మహిళలకు పా దపూజ చేసే అవకాశం తనకు కల్పించడం అభినందనీయమని తెలిపారు.
కార్యక్రమంలో విశ్వత్వ నందగిరి మహారాజ్, విహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు ధనుంజయ్,పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జన్వాడ సంగప్ప, రామ్ రెడ్డి, మాల మహానాడు తాలూక అధ్యక్షుడు విశ్వనాథ్, రామకృష్ణ దత్తాత్రేయ, దశరథ్, బిజెపి, విహెచ్పి, సామాజిక సమరసత అభియాన్ బాధ్యులు పాల్గొన్నారు.