17 April, 2026 | 11:10 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!

17-04-2026 09:43 PM

 ముఖ్య అతిథిగా  తెలంగాణ స్టేట్ రిటైర్డ్ డిజిపి జితేందర్ దంపతులు!!

శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలో నిర్మితమైన శ్రీ భగలాముఖి శక్తిపీఠం. భారతదేశ నలుమూలల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి శ్రీ భగలాముఖి శక్తి పీఠం అమ్మవారి విశిష్టలు తెలుసుకొని అనేకమంది భక్తులు ప్రతినిత్యం ప్రజలు భారీ సంఖ్యలో ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకోవడం కోసం రావడం జరుగుతుంది. అమ్మవారి ప్రీతి పాత్రమైన రోజుఅమావాస్య కావడం సందర్భంగా శ్రీ భగలాముఖి అమ్మవారి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి సన్నిధిలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలునిర్వహించారు.

ముఖ్యఅతిథిగా తెలంగాణ స్టేట్ రిటైర్డ్ డిజిపి జితేందర్ దంపతులు విచ్చేశారు. అమ్మవారి ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు.   భక్తులు పెద్ద ఎత్తున యజ్ఞం పాల్గొనగా  ఆలయ ట్రస్టు చైర్మన్ ఉపాసకులు బ్రహ్మశ్రీ  శాస్త్రుల లక్ష్మి వెంకటేశ్వరశర్మ పండితులు  భగలాముఖి అమ్మవారికి మహా మంత్రహవనం  మహాపూజ అర్చన పంచామృతలతో అభిషేకం హరిదార్చన హవనం  పూర్ణాహుతితో విశేష పూజలు చేశారు. వచ్చిన భక్తులకు పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి యొక్క విశేషాలు తెలియజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

అమావాస్య సందర్భంగా ఆలయ  ప్రాంగణంలో కీర్తిశేషులు పబ్బ రామమ్మ అంజయ్య గుప్త వారి స్మారకార్థం కుటుంబ సభ్యులు పబ్బ స్వరూప రమేష్ గుప్త అన్నదాన కార్యక్రమాన్ని  వచ్చిన భక్తులకు అన్నప్రాసద   వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి నరేందర్ గౌడ్, సి ఐ రంగ కృష్ణ,శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి, నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి, శివంపేట మండల తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా,మరియు స్థానిక గ్రామ సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్ ముదిరాజ్, ఉప సర్పంచ్ ఇసు గారి మల్లేశం, తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, మరియుపీఎంజి యువసేన సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.