శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.
17-04-2026 09:45 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవం 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించబడునని గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ తెలిపారు. 18 వతేది శనివారం ఉదయం పూజలు ప్రారంభమై 20 వతేది సోమవారం విగ్రహాల ప్రతిష్టలు ఏర్పాటు చేసి భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని స్వామి ఆశిస్సులు పొందాలని కోరారు.






