పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి
టీపీయూఎస్ డిమాండ్
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య కోరారు. దేశవ్యాప్తంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలులోకి వచ్చినప్పుడు, దానికి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/4 మరియు 57/5 ఉత్తర్వులు అత్యంత కీలకమైనవని, వీటి ప్రకారం సీపీఎస్ అమలుకు ముందు వెలువడిన నోటిఫికేషన్ల ద్వారా నియామకమైన వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని పేర్కొన్నారు. రాష్ట్రం లో ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు ఈ ప్రయోజనాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం నిరాకరించడం సరైనది కాదని శనివారం ప్రకటనలో తెలిపారు.






