స్పైస్ జెట్ కీలక నిర్ణయం.. క్యాబిన్ సిబ్బందికి 3 నెలలు హాలీడేస్
30-08-2024 05:25 PM
హైదరాబాద్: లో బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాలలో కూరుకుపోయింది. గత ఆరేళ్లుగా నష్టాలను చవిచూస్తున్న విమానయాన సంస్థ ఉద్యోగుల జీతాలు సైతం చెల్లించడం కష్టంగా మారిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తాత్కాలికంగా 150 మంది క్యాబిన్ సిబ్బందిని సైతం సెలవులకు పంపినట్లు ప్రకటించింది. గత నెలో స్పైస్ జెట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) ద్వారా 3000 కోట్లను సమీకరించే ప్రక్రియను ప్రారంభించింది. ఇది సెప్టెంబర్ చివరి నాటికి పూర్వమునుంచని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇదిలా ఉండగా స్పైస్ జెట్ చివరిసారిగా 2017 2018 లో మాత్రమే రూ. 557 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తర్వత్తర్వాత ఆరేళ్ల నుంచి వరుసగా నష్టాలనే చవిచూస్తోంది.






