calender_icon.png 14 October, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.66 వేలకే వెన్నెముక సర్జరీ

14-10-2025 12:21:16 AM

  1. చందా ఆసుపత్రి ఆరో వార్షికోత్సవ ఆఫర్
  2. ఈ నెల 31 వరకు ప్రత్యేక ప్యాకేజీలు
  3. చైర్మన్ డాక్టర్ శ్రీనివాసరావు

కరీంనగర్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): సమాజం పట్ల బాధ్యతగా, అందరికీ అందుబాటు ధరల్లో ఉత్తమ వైద్యసేవలు అందించ డమే తమ ధ్యేయం అని చందా న్యూరో డ్రా మా కేర్ సెంటర్ చైర్మన్, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చందా న్యూరో ట్రామా కేర్ సెంటర్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా రోగులకు అతి తక్కువ ధరలకే వైద్య సేవలు అందించనున్నట్లు ప్రకటించారు.

ఈ నెల 14 నుంచి 31 వరకు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ ప్యాకే జీలో భాగంగా రూ.2 లక్షల విలువైన వెన్నెముక శస్త్రచికిత్సను కేవలం రూ.66,666కే, మెదడు శస్త్రచికిత్సను రూ.లక్షకే నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే రోగులకు పలు ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నట్లు తెలిపారు. న్యూరో సేవలు జనరల్ ఫిజీషియన్ సేవలు ప్యాకేజీలు ఉన్నాయని చెప్పారు.