calender_icon.png 2 May, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతోనే ఉల్లాసం

28-04-2025 01:54:40 AM

  1. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
  2. ఆటలలో గెలుపు ఓటములు సహజం  
  3. ఇబ్రహీంపట్నం ఏసిపి  రాజు 

యాచారం ఏప్రిల్ 27  మండలంలో మొండి గౌరెల్లి గ్రామం లో  ప్రీమియర్ క్రికెట్ లీగ్ గత కొన్ని రోజులుగా  సాగి ఆదివారం. ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం  ఏసిపి రాజు హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏసిపి రాజు   మాట్లాడుతూ. క్రీడలు మానసికల్లాసంతో శరీరానికి దృఢత్వాన్ని కలిగిస్తాయని పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని అన్నారు.

ఆటలో గెలుపు ఓటములు సహజమని ప్రతి ఒక్క క్రీడాకారుడు స్నేహభావంతో మెలగాలని అన్నారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్ల గంజాయి, మద్యం, సిగరెట్ ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దుష్టి కేంద్రకరించి ఉద్యోగం చేస్తూ కుటుంబ పోషణలో తల్లిదండ్రులకు అండగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్, ఆర్గనైజర్ గోడుకొండ్ల ప్రవీణ్, కుంటి ఐలేష్, గోడుకొండ్ల ప్రసాద్,  క్రీడాకారులు, గ్రామ యువత పాల్గొన్నారు.