27-06-2025 01:57:12 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): తమ నగ్న చిత్రాలు, వీడియో లను ఆన్లైన్లో విక్రయిస్తూ, లైంగిక కార్యకలాపాలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న దంపతులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అంబర్పేట్, మల్లికార్జున నగర్‌కు చెందిన హరీశ్ వృత్తిరీత్యా డ్రైవర్. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తన భార్యతో కలిసి ఓ దారుణమైన పథకం వేశారు.
తమ ఇంటి టెర్రస్‌పైనే పరదాలు కట్టి, హెచ్డీ కెమెరాలతో తమ నగ్న చిత్రాలు, వీడియోలు చిత్రీకరించారు. తీసిన వీడియోలను ‘స్వీట్ తెలుగు కపుల్ 2027’ అనే పేరుతో ఆన్లైన్లో ప్రచారం చేశారు. ఆసక్తి ఉన్నవారు డబ్బు చెల్లించాక, వారికి ప్రత్యేక లింకులు పంపేవారు. ఒక్కో కస్టమర్ నుంచి రూ.300 నుంచి రూ.2,000 వరకు వసూలు చేశారు. గత నాలుగు నెలలుగా ఈ దందా సాగుతోంది.
వీడియోలకు డిమాండ్ పెరగడంతో వారి అకృత్యాలు మరింత శ్రుతిమించాయి. ఏకంగా లైవ్ స్ట్రీమింగ్ ప్రారం భించారు. దీనికోసం వేలల్లో డబ్బు వసూలు చేశారు. ఓ ప్రాంతంలో పదుల సంఖ్యలో యువకులు గుమిగూడి డబ్బు పంపితే, వారికి రాత్రి వేళల్లో లైవ్ సెక్స్ లింకును పంపేవారు. ఈ దందా గురించి స్థానికంగా వైరల్ కావడంతో విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టికి వెళ్లింది. సమాచారం అం దుకున్న ఓ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్, కస్టమర్లా నమ్మించి దంపతులకు డబ్బు పంపా డు.
వారు లింక్ పంపడంతో దందా నిజమేనని నిర్ధారించుకున్న ఉన్నతాధికారులు వెంటనే దాడికి ఆదేశించారు. పోలీసులు దంపతులను అరెస్టు చేసి, వారి నుంచి కెమెరా, లైవ్ లింక్ పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంబర్పేట్ పోలీసులు వారిని లోతుగా విచారిస్తున్నారు.