10-10-2025 12:00:00 AM
రాష్ట్ర విద్యాకమిషన్ మెంబర్ చారగొండ వెంకటేశ్
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ ౯ : క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర విద్యాకమిషన్ మెంబర్ చారగొండ వెంకటేశ్ అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం జెడ్పీహెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో 69వ ఎస్‌జీఎఫ్‌ఐ హయత్‌నగర్ జోనల్ పరిధిలో నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్‌ఎం సెలక్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్నిరాష్ట్ర విద్యాకమిషన్ మెంబర్ చారగొండ వెంకటేశ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో క్రీడలను ప్రోత్సహిస్తే అడ్మిషన్లు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతుందని తెలియ జేశారు. ఉపాధ్యాయులు విద్యాబోధనపైనే దృష్టిపెట్టకుండా విద్యార్థులకు చదవడం, రాయడం, గణిత ప్రక్రియలు విద్యార్థులకు వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు.
కబడ్డీ పోటీలలో పాల్గొనే విద్యార్థులను, వ్యాయమ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పెటా అధ్యక్షులు రాఘవరెడ్డి, హయత్‌నగర్ జోనల్ సెక్రటరీ నిర్మల, పీటీలు చంద్రమోహన్, వెంకటేశ్వర్లు, నర్సింహారావు, ఉపాకిరణ్, హెచ్‌ఎం. దాసరి ప్రతాప్, ఉపాధ్యాయుల బృందం, గ్రామస్తులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.