10-10-2025 09:58:54 AM
హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. లాలాగూడ పోలీస్ స్టేషన్(Lalaguda Police Station) పరిధిలోని సాయిబాబా గుడి సమీపంలో డిగ్రీ విద్యార్థిని మౌలిక(19) ఆత్మహత్య చేసుకుంది. వాలీబాల్ కోచ్(Volleyball coach) అంబాజీ వేధింపులే కారణమని విద్యార్థిని తండ్రి ప్రమోద్ కుమార్ ఫిర్యాదు చేశాడు. తన కూతురును ప్రేమించాలంటూ కోచ్ వేధించినట్లు తండ్రి ఆరోపించారు. మనస్థాపానికి గురై ఉరివేసుకుని చనిపోయినట్లు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. తార్నాక రైల్వే డిగ్రీ కాళాశాలలో(Tarnaka Railway Degree College) విద్యార్థిని డిగ్రీ చదువుతోంది. విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.