calender_icon.png 23 January, 2026 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు

23-01-2026 12:00:00 AM

ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం, జనవరి 22,  (విజయక్రాంతి): ఐటీడీఏ పరిధిలో పనిచేయుచున్న ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు మొట్టమొదటిసారిగా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 24 తేదీలలో కిన్నెరసాని లోని ప్రభుత్వ మోడల్ క్రీడా పాఠశాలలో నిర్వహించ బడునని ఆయన అన్నారు. ఈ క్రీడల వలన శారీరక ఉల్లాసం పొందుటకు, పని ఒత్తిడి తగ్గించుటకు, ప్రతి ఉద్యోగి ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఐక్యత స్నేహభావం కలిగి ఉండడానికి ఈ క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన అన్నారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకిష్టమైన క్రీడలు పురుషులకు మరియు స్త్రీలకు వేరువేరుగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో వాలీబాల్, టెన్నికా యిట్, సెటిల్ బ్యాట్మెంటన్, చదరంగం (చెస్సు), క్యారమ్స్, మ్యూజికల్ చైర్, 50 మీటర్ల పరువు పందెం, షాట్ పుట్, మహిళలకు స్కెప్పింగ్, లెమన్ స్పూన్, పురుషులకు క్రికెట్ క్రీడలు కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కావున ఆసక్తిగల ఉద్యో గులు, ఉపాధ్యాయులు ఈనెల 23 శుక్రవారం రోజు ఉదయం 9 గంటలకు పాల్వం చలోని కిన్నెరసాని ప్రభుత్వ మోడల్ క్రీడ పాఠశాల యందు తమ పేర్లు నమోదు చేసుకొని వివిధ క్రీడలలో పాల్గొనాలని కోరారు.