23-01-2026 12:00:00 AM
మణుగూరు, జనవరి 22 (విజయక్రాంతి): రాజీవ్ గాంధీనగర్ లోని రాధిక హైస్కూల్ విద్యార్థుల వార్షిక క్రీడలు గురువారం స్కూల్ గ్రౌండ్‌లో హట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిధి సీఐ పాటి నాగబాబుతో కలిసి పాఠశాల చైర్మన్ గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా మానసిక, శారీరక దృఢ త్వాన్ని పొందవచ్చని, ప్రతి ఒక్కరూ క్రీడా స్పూర్తిని కలిగి ఉండాలన్నారు.
ప్రతినిత్యం విధుల్లో నిమగ్నమయ్యే పోలీసుల కు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తా యని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాల చైర్మన్ గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు ఐక్యతని, ఏకాగ్రతని, సృజనాత్మకమైన నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థుల్లో క్రీడా ఉత్సాహాన్ని నింపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఎం నరేష్ మాట్లాడుతూ ప్రత్యేకంగా మణుగూరు నుంచి తమ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు రాష్ట్ర క్రీడల్లో సైతం రాణిస్తు న్నారని పేర్కొన్నారు. అటువంటి విద్యా ర్థులను ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో ఎంతోమంది తమ పాఠశాల నుండి రాష్ట్ర క్రీడలకు ప్రాతినిధ్యం వహించాలని విద్యార్థులకు సూచించారు.
స్కూల్ యాజమాన్యం క్రీడా పోటీలను మూడు రోజులపాటు నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాస్థాయిలో ఆటల ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ బహూకరించారు. తదనంతరం ముఖ్యఅతిథి సీఐ నాగబాబుకు పాఠశాల మార్చి పాస్ట్ స్టూడెంట్స్ గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్, సిహెచ్ జై సిం హారెడ్డి, జి సంపత్ రెడ్డి, బద్దం శ్రీని వాస్ రెడ్డి, నూకారపు రమేష్, ఇన్చార్జి మేడం ఉషా, కీర్తి,నరేందర్, చంద్రకళ ,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, బోధ నేతల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.