17 March, 2026 | 12:28 AM

అటవీశాఖ ఉద్యోగులకు ఆటల పోటీలు

21-09-2024 12:31 AM

ప్రారంభించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ

నిజామాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): నిజామాబాద్‌లోని రాజారాం స్టేడియంలో బాసర జోనల్ లెవెల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2024ను శుక్రవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లతో సతమతమవుతున్న ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఎమ్మెల్యే అన్నారు. ఇందూరు జిల్లాలో స్పోర్ట్స్ ట్రాక్, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కాగా ఈ పోటీల్లో బాసర్ ఫారెస్ట్ జోన్‌లోని ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల అటవీశాఖ జట్లు పాల్గొన్నాయి.