calender_icon.png 31 December, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం

31-12-2025 12:00:00 AM

* డీఎస్పీ సూర్యనారాయణ ఏఎంసీ చైర్మన్ తిరుమల 

కాటారం, డిసెంబర్ 30 (విజయక్రాంతి): శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదపడతాయని కాటారం డిఎస్పి సూర్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో చింతకాని అడ్డరోడ్డు వద్ద క్రాస్ కంట్రీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పా ల్గొన్న క్రీడాకారులను వారు అభినందించారు.

జిల్లా ఆత్లేటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో సుమారు 200 మంది బాలబాలికలు పాల్గొన్నట్లు అసోసియేషన్ జిల్లా అ ధ్యక్షులు పంతకాని సమ్మయ్య, కార్యదర్శి పూతల సమ్మయ్య తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంథని శాసనసభ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, యూత్ ప్రధాన కార్యదర్శి కడారి విక్రమ్, కర్ణాకర్ రావు, అజయ్, రాజు, సాంబమూర్తి, రఘువీర్, పూర్ణిమ, లక్ష్మణ్, గౌతమి, రమేష్, చందర్, విజయలక్ష్మి, జలంధర్, రవికుమార్, సారంగపాణి, వీరన్న, దేవేందర్ క్రీడాకారులు పాల్గొన్నారు.