27 July, 2026 | 6:58 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

క్రీడల వల్ల స్నేహబంధాలు బలపడతాయి

12-01-2026 12:41 AM

ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

తుంగతుర్తి, జనవరి 11 : క్రీడల వల్ల యువతలో ఐకమత్యంతో పాటు స్నేహబంధాలు బలపడతాయని, క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దీప్లా నాయక్ ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరిక ధారుడ్యానికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు నర్సయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కోరుకొప్పుల నరేష్ గౌడ్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ చారి, సర్పంచ్ గుగులోతు రాజశేఖర్, వార్డు మెంబర్లు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.