12-01-2026 12:41:30 AM
నంగునూరు, జనవరి 11:పెట్టుబడి భారమై, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు.ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.రాజగోపాల్పేట ఎస్త్స్ర టి. వివేక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజిరెడ్డి (50) వ్యవసాయంతో పాటు ఎడ్ల వ్యాపారం చేసేవారు.వ్యాపారంలో నష్టం రావడం, సాగు కోసం వేసిన రెండు బోర్లు విఫలం కావడంతో సుమారు 5 లక్షల రూపాయల వరకు అప్పులయ్యాయి.
అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన రాజిరెడ్డి, ఈనెల 10న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగారు.గమనించిన స్థానికులు వెంటనే ఆయనను హైదరాబాద్లోని యశోద, ఆ తర్వాత ఆర్వీఎం ఆస్పత్రులకు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మృతిచెందాడు.మృతుడి భార్య ఎల్ల మాధవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.