31-07-2025 12:00:00 AM
ప్రిన్సిపాల్ వి. లక్ష్మాంజలిదేవి
సిద్దిపేట రూరల్, జూలై 30: సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 31 గురువారం మిగిలిన సీట్లలో అడ్మిషన్ పొందేందుకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ వి. లక్ష్మాంజలిదేవి తెలిపారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మాత్రమే ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.
ఆసక్తి కలిగిన విద్యార్థులు గురువారం 31న ఉదయం 9 గంటలకు నుండి 1గంట వరకు కళాశాల ఆవరణలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనీ సూచించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మిట్టపల్లి జూనియర్ కళాశాలలో మిగిలిన కొన్ని సీట్లకు మాత్రమే అడ్మిషన్ లభించే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.