calender_icon.png 31 July, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం

30-07-2025 11:26:27 PM

జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య..

బోథ్ (విజయక్రాంతి): కాంగ్రెస్  ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందేలా కృషి జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లపులా నర్సయ్య(District Library Chairman Mallapula Narsaiah) పేర్కొన్నారు. బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలోనే 10 సంవత్సరాల అభివృద్ధి బోథ్ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిందని, కేసీఆర్ చేసిన ధ్వంసాన్ని పూడ్చగలిగామని అన్నారు.

పది సంవత్సరాలు అభివృద్ధికి దూరంగా ఉంచిన బీఆర్ఎస్ పార్టీ పాలన కంటే 18 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన బాగుందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారని, ఎన్నడు లేని విధంగా ప్రజల అవసరాలు తీర్చే విధంగా పొలంబాట, సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో బీటీ రోడ్లు, పోడు భూముల,ఆదివాసుల వ్యవసాయ సహకారం కై సోలార్ మోటార్ పంప్ సెట్ లు, ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డులు, భూభారతి చట్టం, ఎస్సీ ఎస్టీ సభ్యుల ద్వారా నిధులు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీలకు పక్కాభవనాలు మంజూరు చేస్తుందని, నియోజకవర్గానికి వచ్చే ప్రతి పైసా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తామే తెచ్చామని డంబికాలు పలుకుతున్నారని విమర్శించారు. 

ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, బజార్హత్నూర్ మండల అధ్యక్షులు జల్కే పాండురంగ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు సుద్దుల అరుణ్ రెడ్డి, నేడుగొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు హీర సింగ్,షేక్ అబూద్, సద్దాం, గాజుల అశోక్, కిషన్, సీనియర్ నాయకులు శివుడు, యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.