గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్
బోథ్, జూన్ 13(విజయ క్రాంతి): గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సభ్యత్వ నమోదు పండుగ వాతావరణం లో జరుపుకోవాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పిలుపునిచ్చారు శనివారం ఆయన నివాసంలో బోత్ సునాల మండలాలవివిధ గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపట్టాలని కోరారు అయితే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
అంతేగాక అనేక గ్రామాలలో బిఎల్వోలు ఓటరు సర్వే చేపడుతున్నారని అయితే వారు కావాలని కొంతమంది పేర్లను మిస్సింగ్ చేస్తున్నారన్నారు. ఈ విధమైన పొరపాటు జరుగుతే అధికారుల దృష్టికి తీసుకురావాలని లేకుంటే భవిష్యత్తులో ఓటు హక్కును కోల్పోవాల్సి ఉంటుందన్నారు. కుట్రపూరితంగా సర్వే జరిపితే బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు తక్షణమే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే బోథ్ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు






