డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ
ఎర్రుపాలెం మే 26(విజయక్రాంతి): మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ధనసరి అనసూర్య సీతక్కలు పలు అభివృద్ధి పనుల నిమిత్తం పర్యటించనుండడంతో గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల ఏర్పాట్లను మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ, వైరా ఏసీపీ సారంగపాణి, డి ఆర్ డి ఏ ఏపీ డి ఆర్ జయశ్రీ, సీఐ మధులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా వారు సభా స్థలిని, ప్రారంభించాల్సిన, శంకుస్థాపన చేయాల్సిన ప్రదేశాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి , ఎస్త్స్ర రమేష్ కుమార్, ఎంపీడీఓ యం.శ్రీనివాసరావు, ఏపీఎం హరినారాయణ, ఎంపీవో శ్రీలక్ష్మి, సొసైటీ చైర్మన్ వెన్నపూస కృష్ణారెడ్డి,మాజీ సొసైటీ చైర్మన్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి,క్లస్టర్ ఇంచార్జి గుడేటి బాబురావు, దేవరకొండ శ్రీను,కర్నాటి సుధాకర్ రెడ్డి, వేముల వెంకటేశ్వరావు తదితర నాయకులు, అధికారులు ఉన్నారు.






