27 May, 2026 | 2:03 AM

రెండు రాష్ట్రాల డాన్స్ పోటీల బ్రోచర్ ఆవిష్కరణ

27-05-2026 12:14 AM

ఇల్లందు టౌన్, మే 26 (విజయక్రాంతి): ఇల్లందుకు చెందిన వెంకట్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి డాన్స్ పోటీల బ్రోచర్ను హనుమకొండ అంబేద్కర్ భవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి డాన్స్ కాంపిటీషన్ సందర్భంగా తెలుగు ఫిలిం కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత, తెలంగాణ డాన్స్ అండ్ స్పోరట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాస్టర్ ఆవిష్కరించి నిర్వాహకులను అభినందించారు.

ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభకు ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని పేర్కొంటూ యువ కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్న వెంకట్ డాన్స్ అకాడమీ సేవలను ప్రశంసించారు. అకాడమీ నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రతిభావంతులైన డాన్సర్లను ప్రోత్సహించే లక్ష్యంతో పోటీలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా యూనియన్ ప్రెసిడెంట్ ప్రశాంత్ మాస్టర్, కడారి వెంకటేష్, శేఖర్, సాయి, అరుణ్, రమేష్ మాస్టర్ తదితర డాన్స్ మాస్టర్లు, కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు.