13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

28-03-2026 12:37 AM

ఆలయ గోపురాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

 చిట్యాల, మార్చి 27 : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోగా, ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యుడు ఎమ్మెల్యే  వేముల వీరేశం నియోజకవర్గంలోని పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.చిట్యాల పట్టణం తొలుత చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పట్టణంలోని శివాలయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని , ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోపురాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో,  ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కేతపల్లి, నకిరేకల్ నార్కట్ పల్లి మండలాలలో ఉన్న పలు ఆలయాలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పలు మండలాల స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.