13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

28-03-2026 12:35 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 27 (విజయ క్రాంతి): మండలంలోని వెంకంపల్లి గ్రామంలో నూతన సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ సిహెచ్.జ్యోతి సురేందర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతన సీసీ రోడ్డు పనులను గ్రామంలోని పోచమ్మ టెంపుల్ నుండి గ్రామపంచాయతీ వరకు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సిహెచ్.జ్యోతి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ..

ఎంజి ఎన్‌ఆర్‌ఈజిఎస్ ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు పది లక్షల నిధులు మంజూరు కావడంతో నూతన సిసి రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి పది లక్షల నిధులు మంజూరుకు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమంత్ రెడ్డి,మాజీ సర్పంచ్ సుభకర్ రెడ్డి, తాండూర్ సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.