calender_icon.png 12 August, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం రథోత్సవం

05-12-2024 09:59:55 PM

భారీగా తరలివచ్చిన భక్తులు

రథానికి పూజలు చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్,(విజయ క్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతి పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొలి మఠాధిపతి పూర్ణానంద సరసతీ సామి పుణ్యతిధి సందర్భంగా నిరహించే జాతర వేడుకలను మఠాధిపతి శ్రీ యోగానంద సరసతి సామి నేతృతంలో గురువారం రథోత్సవ ఉరేగింపును వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ముందుగా  వేదమంత్రోచ్ఛరణల నడుమ రథానికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళ హారతులతో శోభాయాత్రలో ముందు నడవగా, పట్టణంతో పాటు చుట్టుపక్కల పల్లెలు, పక్కనే ఉన్న మహారాష్ర్ట నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. పట్టణ పురవీధుల గుండా సాగిన రథోత్సవ వేడుకల్లో భక్తుల భజన కీర్తనలు, సామివారి నామస్మరణతో పట్టణ పురవీధులని మారు మ్రోగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ గోపాలకృష్ణ మఠానికి ఎంతో విశిష్టత ఉందని పేర్కొన్నారు. 15 రోజుల పాటు జరిగే జాతరను హిందూ బంధువులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.