05-12-2024 09:54:17 PM
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ గౌష్ ఆలం
ఆదిలాబాద్,(విజయక్రాంతి): వివిధ కేసుల నిమిత్తం పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రజల పట్ల గౌరవప్రదంగా మెలగాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పోలీస్ సిబ్బందికి సూచించారు. నూతనంగా వచ్చిన పోలీసు కానిస్టేబుల్ లకు అన్ని పోలీస్ స్టేషన్ లలో విధులను నిరర్తించడం జరుగుతుంది. వీరందరికీ పోలీస్ స్టేషన్ విధులపై, నిరహణపై పూర్తి అవగాహన కల్పిస్తూ విధులను సక్రమంగా నిరర్తించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరును పరిశీలించారు. మొదటగా రిసెపన్ సెంటర్ ను పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ బాధితులకు సరైన సమయంలో న్యాయం చేకూరే విధంగా సంబంధిత అధికారులను కేటాయిస్తూ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా ప్రజలకు న్యాయం చేకూరే విధంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరంతరం గస్తీ నిరహిస్తూ ఎలాంటి అసాంఘిక సంఘటన చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సిఐ భీమేష్, ఎస్సై తిరుపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.