calender_icon.png 22 July, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రామనగర్ కాలనీ సమస్యలను పరిష్కరిస్తా..

22-07-2025 12:12:03 AM

- బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

ఎల్బీనగర్, జులై 21 : శ్రీ రామ నగర్ కాలనీ సమస్యలను పరిష్కరిస్తూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో సోమవారం ఆయన పర్యటించారు. కాలనీలో రూ, 27 లక్షలతో రోడ్లను అభివృద్ధి చేసినందుకు కార్పొరేటర్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, నూతన కరెంటు స్తంభాలు వేయించాలని, వీధిదీపాలు పెట్టించాలని కోరారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ త్వరలోనే కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, ట్రెజరర్ రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ప్రసాద్, నాగమణి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లా రెడ్డి, భూపతి రెడ్డి, వెంకట్ రెడ్డి, సభ్యులు రంగ రెడ్డి, లక్ష్మీ నారాయణ, కృష్ణ, పుష్పాల్ రెడ్డి, రాధ కృష్ణ, మరియు పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మరియు తదితరులుఉన్నారు.