22-07-2025 12:13:15 AM
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ఎంపీల సంగతి, ప్రధాని సంగతేంటో ఈ పార్లమెంట్ సమావేశాల్లో చూస్తామని, బీసీ పక్షపాతులు ఎవరు, వ్యతిరేకులెవరో తేలిపోతుందని కాం గ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు పే ర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం బీసీ రిజర్వేషన్ల పెంపునకు పూర్తి మద్దతు ఇస్తున్నద న్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహిచిందని, బీజేపీ ఎంపీలకు చిత్త శుద్ధి ఉంటే కేంద్రంతో బీసీ రిజర్వేషన్ ఆమోదింపజేయాలని సూచించారు. షెడ్యూల్ 9 చట్టసవరణ చేసి 50 శాతం రిజర్వేషన్ సీలింగ్‌ను ఎత్తివేయాలని చెప్పారు. ఓబీసీ మోదీ ప్రధానిగా ఉండి బీసీ బిల్లుకు ఆమోదిస్తారా లేదా చూడాలన్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పదవీ కోసం బీసీలు కాదని ఓసీకి వచ్చిందన్నారు.