calender_icon.png 22 July, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఇందిరాశక్తి సంబురాలు

22-07-2025 12:09:35 AM

- పాల్గొన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి 

ఇబ్రహీంపట్నం, జూలై 21:ఇందిరా శక్తి సంబరాలు సోమవారం మండల కేంద్రంలోని శాస్త్ర గార్డెన్ లో ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై  మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు. మహిలందరిని కోటిశ్వర్లను చెయ్యాలని ప్రభుత్వం కృతనిశ్చయతంతో పని చేస్తుందన్నారు. నేడు మహి ళలు గౌరవంగా ఉండటం కోసం మహిళలకు ప్రత్యేకంగా పెట్రోల్ బంకులు కేటీయిం చడం జరిగిందన్నారు.

పలు ప్రాంతాలలో పెట్రోల్ బంకులు నడిపించే స్థాయికి మహిళలు రావడం జరిగిందన్నారు. 3640 సం ఘాలకు రూ. 4 కొట్లా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందాన్నారు. మహిళల కోసం ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు  ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కలిపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునా థ్ రెడ్డి, వైస్ చైర్మన్ కరుణాకర్, పిఎస్సిఎ స్ చైర్మన్ పాండురంగ రెడ్డి,  కాంగ్రెస్ రాష్ట్ర నా యకులు ఈసీ శేఖర్ గౌడ్, కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాల శేఖర్ రెడ్డి, నాలుగు మండలలా సహకార సంఘాల మహిళలు పాల్గొన్నారు.