11-05-2025 07:37:20 PM
మహిళలకు మార్గ నిర్దేశం చేసిన శ్రీ ప్రణయ దాసాజీ
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పరంజ్యోతి కల్కి భగవతి భగవానుల ఆలయంలో ఆదివారం మహిళల కోసం ప్రత్యేకంగా స్త్రీ శక్తి వరం అనే కార్యక్రమాన్ని ప్రణయ దాసాజీ నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రణయ దాసాజీ మార్గ నిర్దేశనం చేస్తూ మహిళలలో దాగి ఉన్న శక్తిని జాగ్రత్తపరిచి మహిత్యేకంగా స్త్రీ శక్తి వరం అనే కార్యక్రమాన్ని ప్రణయ దాసాజీ నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రణయ దాసాజీ మార్గ నిర్దేశనం చేస్తూ మహిళలలో దాగి ఉన్న శక్తిని జాగ్రత్తపరిచి మహిళలకు ఆరోగ్యం ఐశ్వర్యం బాంధవ్యాలకు సఖ్యత సౌభాగ్యం సవాళ్లను ఎదుర్కోవడం నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం నిర్ణయాలను తీసుకునే శక్తిని పెంపొందించుకోవడం వంటి అనేక అంశాలలో పరంజ్యోతి భగవతి భగవానుల అనుగ్రహంతో వారందరికీ మార్గ నిర్దేశం చేశారు. ఆనంద స్థితిని ఉన్నత చైతన్య స్థితిని మహిళలకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మహిళలు వారిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని ఉపయోగించుకుని జీవితంలో సంతోషాన్ని అమ్మ భగవానుల అనుగ్రహం పొందడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ తీర్థ ప్రసాదాలను, అన్నప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సేవకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.