11-05-2025 07:43:20 PM
భద్రాచలం డిగ్రీ కాలేజీ పటాన్మస్ ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్
భద్రాచలం,(విజయక్రాంతి): పాలిసెట్ 2025 ఈనెల 13వ తేదీన నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ భద్రాచలం ప్రిన్సిపాల్, కో ఆర్డినేటర్ డాక్టర్ కె జాన్ మిల్టన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్(4801), ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ సైన్స్ బ్లాక్(4807) అని రెండు సెంటర్లలో 719 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలకు ఒక గంట ముందుగానే అభ్యర్థులు చేరుకోవాల్సిందిగా సూచించారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించబడుతుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి సెంటర్ లోకి అనుమతి ఇస్తామని, పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన సెంటర్ లోనికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. హాల్ టికెట్, హెచ్. బి. పెన్సిల్, బ్లాక్/ బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్, వాచ్, మొబైల్స్, పర్సులు,షూస్, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించేది లేదని చెప్పారు. హాల్ టికెట్ పై ఫోటోలు స్పష్టంగా లేని అభ్యర్థులు గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా తమ ఫోటోలను ధ్రువీకరించుకోవాలని ఆయన వెల్లడించారు.