13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం

27-03-2026 10:41 PM

పాల్గొన్న మేడ్చల్ బిఆర్ఎస్ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి

జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం జవహర్ నగర్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి హాజరై సీతారామ చంద్రులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన

అనంతరం మాట్లాడుతూ... జవహర్ నగర్ లో సీతారాముల కల్యాణానికి ఆధ్యాత్మికత ఉట్టి పడేలా భక్తకోటి మురిసేలా ఘనంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాములోరి కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించి తరించినందుకు జవహర్ నగర్ భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం ఆనందంగా ఉందన్నారు .సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ముధాభావమ అన్నారు. సీతారామ చంద్రుల దయవల్ల జవహర్ నగర్ ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ప్రకృతి పచ్చదనంతో పాడిపంటలతో విరసిల్లాలని కోరుకున్నట్టు మిథిలా ధీశుని దివ్య ఆశీస్సులు జవహర్ నగర్ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.