13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో భక్తులకు వడపప్పు... బెల్లం పానకం అందజేత

27-03-2026 05:17 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ పెరిగిద్ద హనుమాన్ ఆలయంలో అంగరంగ వైభవంగా చూడముచ్చటగా కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు శ్రీరామనవమి ప్రత్యేక ప్రసాదమైన వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు), బెల్లం పానకంను శ్రీ వాసవి వనిత క్లబ్, వాసవి క్లబ్ వారు వితరణ చేశారు, వేసవిలో శరీరానికి ఇది చలువచేస్తాయి.

ఆరోగ్యానికి చాలా మంచిది, తురిమిన బెల్లం నీళ్లు, యాలకుల పొడి, మిర్యాల పొడి , సొంటితో పానకం తయారు చేస్తారు.. నానబెట్టిన పెసరపప్పుతో వడపప్పు నిముషాలు తయారవుతాయి ఇవి శ్రీ సీత రామచంద్రునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలుగా భావిస్తారు. దీనిని భక్తులకు అందించడం ద్వారా  వారి శరీరానికి శక్తిని ఇస్తుందని వారి నమ్మకం. ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్, వాసవి క్లబ్ , ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.