calender_icon.png 21 January, 2026 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

21-01-2026 12:41:28 AM

పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి 

కామారెడ్డి, జనవరి 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి మాత ఆలయంలో మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు. ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో 102 గోత్రాలతో కూడిన కలశాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారి భజన కార్యక్రమాలను గత వారం రోజుల నుండి ఈ ఆత్మార్పణ కార్యక్రమానికి కృషి చేస్తున్న కమిటీ పనిచేస్తుందని అధ్యక్షులు భూమేష్ గుప్తా తెలిపారు.

అమ్మవారి విశేష పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వాసవి మాత ఆత్మార్పణ ఉత్సవాలకు ఆలయానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. వాసవి మాత అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం కార్యక్రమాలు  విశేష భక్తుల ఆధ్వర్యంలో పండితులు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ గుప్తా ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆలయ కమిటీకుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. దీంతో ఈ కార్యక్రమాన్ని ముగించి మంగళవారం రోజున రాత్రి వరకు ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు. అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ గుప్తా కార్యదర్శి కూర శ్రీనివాస్, విశ్వనాథులరాజేందర్, ఉపాధ్యక్షులు సునీల్ కుబీ, యాదా అంజయ్య, గరిపల్లి శ్రీధర్ బంకటేష్ శీనన్న, మొగిలిపల్లి రమేష్ గుప్తా, మోత్కూరు శ్రీనివాస్,వెంకటేష్, నీల రాజు, కాసర్ల నరహరి,ఆలయ అర్చకులు కృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మర్పణ కార్యక్రమం ని ఘనంగా నిర్వహించారు.