21-01-2026 12:40:58 AM
నిర్మల్ జిల్లా భైంసాలో ఘటన
బైంసా, జనవరి 20 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కుబీర్ మండల కేంద్రానికి చెందిన కారు డ్రైవర్ బి వికాస్ (25), కుట్టి గ్రామానికి చెందిన భోజరాం పటేల్(55), పెద్ద రాజన్న( 65), బోయిడి బాబన్నలతో పాటు గంగాధర్, మరో ఇద్దరు హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించి తిరుగు పయణమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున భైంసాకు చేరుకోగా.. సాత్పుల్ వంతెనపై ముందు వెళ్లున్న కంటైనర్‌ను కారు డ్రైవర్ అతివేగంగా నడిపి ఢీకొట్టాడరు.
దీంతో కారు ముందు భాగం కంటైనర్ కిందికి దూసుకుపోయి నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్ బి వికాస్, భోజరాం పటేల్, పెద్ద రాజన్న, బోయిడి బాబన్న మృతి చెందారు. వెనుక సీటులో కూర్చున్న గంగాధర్‌కు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని నిజాంబాద్ ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. ఎదురుగా ఉన్న లారీ కంటైనర్ను గమనించకుండా వేగంగా ఉండ టం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమా దం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.